ఆయిల్‌పాం తోటల విస్తరణ వేగవంతం
ఆయిల్‌ఫెడ్ నిర్దేశించుకున్న ఆయిల్‌పాం విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది మార్చిలోపు 75 వేల ఎకరాల్లో ప్లాంటేషన్‌ను పూర్తి చేస్తామని సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నారంవారిగూడెం ఆయిల్‌ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్యానికి అవసరమైన మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు.
- మార్చిలోపు 75 వేల ఎకరాల్లో ప్లాంటేషన్
- టీఎస్ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి
అశ్వారావుపేట, డిసెంబర్ 20: ఆయిల్‌ఫెడ్ నిర్దేశించుకున్న ఆయిల్‌పాం విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది మార్చిలోపు 75 వేల ఎకరాల్లో ప్లాంటేషన్‌ను పూర్తి చేస్తామని సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నారంవారిగూడెం ఆయిల్‌ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్యానికి అవసరమైన మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆయిల్‌ఫెడ్ క్యాలండర్ ప్రకారం రైతులకు మొక్కలు సరఫరా చేస్తున్నామన్నారు. సరైన భూపత్రాలు లేని రైతులకు ఫుల్ కాస్ట్ రూ.200కు మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటివరకు 700 ఎకరాలకు అవసరమైన మొక్కలు పంపిణీ చేశామన్నారు. ఖమ్మం జిల్లా నుంచి 5,600 ఎకరాలు, భద్రాద్రి జిల్లా నుంచి 6,546 ఎకరాలకు మొక్కలు అవసరమని దరఖాస్తులు వచ్చాయన్నారు.
వారికి ఏప్రిల్ తర్వాత మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా మొక్కలు తరలిపోతున్నాయని అందిన ఫిర్యాదులపై సోషల్ ఆడిట్ చేపట్టామన్నారు. ఉపాధి సిబ్బందితో సర్వే చేయిస్తున్నామన్నారు. ఈఆయిల్ ఇయర్లో 19.32 రికవరీ శాతాన్ని సాధించామన్నారు. దీంతో టన్ను గెలల ధర రూ.595 పెరిగిందన్నారు. వచ్చే ఆయిల్ ఇయర్లో రికవరీ శాతాన్ని 19.50 సాధిస్తామన్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతులకు ఆయిల్‌పాం సాగుపై అవగాహన కల్పించారు. సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వివరించారు. దళారుల బెడద లేకుండా నేరుగా ఆయిల్‌ఫెడ్ గెలలను కొనుగోలు చేస్తున్నదన్నారు. తోటల మధ్య అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. పర్యటనలో ఆయిల్‌ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ, క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

