ఖమ్మం: “విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని , వారికి మంచి భవిష్యత్ ఉందని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సూచించారు. మంగళవారం ఖమ్మం త్రీటౌన్ గాంధీచౌక్ గాయత్రి డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మాదకద్రవ్యాల నివారణ సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు పాల్గొని ప్రసంగించారు.
ఎక్సైజ్ సూపరిండెంట్ సోమిరెడ్డి మాట్లాడుతూ మత్తును వదిలిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుదాం.. గంజాయి , మాదకద్రవ్యాల నియంత్రణకు యువత తమ వంతు సహాయం చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రీటౌన్ సీఐ సర్వయ్య , ఎక్సైజ్ సీఐ జయశ్రీ , సర్వేష్ , కళాశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.