‘ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి’
గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పలువురు రెవిన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా...
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 01 : గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పలువురు రెవిన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం ఖమ్మం రూరల్ తాసీల్దార్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, చేతిలో ప్లే కార్డ్స్ తో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిపిఎస్ విధానం రద్దుచేసి, స్థానంలో ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఆరు డీఏలను తక్షణం విడుదల చేయాలని వారు కోరారు.
గత కొద్ది రోజుల నుంచి ఉద్యోగులు అంచెలంచెలుగా తమ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఈనెల 10వ తేదీన హైదరాబాదులో జరిగే ఉద్యోగుల నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని వారు సహ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్, జిపిఓ లు సిహెచ్ నాగేంద్రబాబు, ఎం.కోటేశ్వరరావు, కే.బాలమురళీకృష్ణ, బంక భాస్కర్, మనం శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ వసంత, నియర్ అసిస్టెంట్ నసీరుద్దీన్, రమేష్ రెడ్డి, ఆశాజ్యోతి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- cps
- khammam news
- Khammam Rural
- OPS
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

