కారేపల్లి, మార్చి 15 : మండల కేంద్రంలో గల వైకుంఠ ధామానికి కారేపల్లి జామే మసీద్ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ విద్యుత్ మోటార్‌ను శనివారం వితరణగా అందజేశారు. సుమారు రూ.25 వేల విలువైన కరెంట్ మోటార్ తో పాటు అందుకు సంబంధించిన సామాగ్రిని గ్రామ పెద్దలకు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో కారేపల్లి వాసులు జడల వెంకటేశ్వర్లు, తురక నారాయణ, రవీందర్, రాంబాబు, కేతిమాల శ్రీను, జూపల్లి వెంకన్న, గడ్డం కోటి, అక్కుల శ్రీను, షేక్ జహీర్, ఆరెల్లి రాజలింగం, కసగాని సుబ్బయ్య, మణికొండ సత్యం, పోతు వెంకటేశ్వర్లు, గంగరబోయిన వెంకన్న, మురళి, సాంబ, చింతల సంపత్, తోటముల శ్రీను, పానుగంటి విజయ్, పబ్బుల శేషయ్య, రామారావు, కిరణ్ పాల్గొన్నారు.