ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 9: ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచే అధికారులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టారు. భద్రాచలం, దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
భద్రాచలంలో 7, దుమ్ముగూడెం 8, అశ్వాపురంలో 2 నామినేషన్లు వేశారు. జడ్పీటీసీలకు మాత్రం ఎవరూ నామినేషన్ వేయలేదు. ఖమ్మం జిల్లా కూసుమంచి, ముదిగొండ జడ్పీటీసీ స్థానాలకు చెరో నామినేషన్ దాఖలయ్యాయి. ఎంపీటీసీ స్థానాలకు ఐదు నామినేషన్లు వేశారు. అయితే ఎన్నికల షెడ్యూల్‌పై కోర్టు స్టే విధించడం.. దీనిపై ఎన్నికల సంఘం నుంచి అధికారులకు ఎలాంటి సమాచారం అందకపోవడంతో సాయంత్ర వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కొనసాగించారు.