భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని బీఆర్ఎస్, వివిధ పార్టీలు, పలు సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో అంబేద్కర్ చిత్రపటానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్తుపల్లి మండలం కిష్టారంలో అంబేద్కర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిర పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఇల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
-నమస్తే నెట్వర్క్