Chicken | ముదిగొండ ఫిబ్రవరి 12 : చికెన్ (Chicken), గుడ్ల (Eggs)పై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని పశు వైద్యాధికారి అశోక్ తెలిపారు. మండల కేంద్రం ముదిగొండలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ పౌల్ట్రీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాంసాహారులు చికెన్, గుడ్డు వినియోగం గురించి ఆందోళన చెందవద్దని.. 60 డిగ్రీల కంటే ఎక్కువగా వేడి చేసుకొని తినాలని అన్నారు.
చికెన్, గుడ్డు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. చికెన్, గుడ్డు విషయంలో వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే అపోహలతో వచ్చే తప్పుడు సమాచారం నమ్మవద్దన్నారు. ప్రభుత్వం చుట్టుపక్కల ప్రదేశాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక చోట నుంచి మరో చోటుకు తరలించే కోళ్ల రవాణాని మాత్రమే నిలిపివేయమని ఆదేశాలు ఇచ్చిందని అన్నారు.
కోళ్ల పెంపకం దారులు కోళ్లకు వచ్చే వైరస్ను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో చికెన్ దుకాణం దారులు చనిపోయిన కోళ్ల మాంసాన్ని విక్రయిస్తే షాప్ సీజ్ చేయడంతోపాటు చట్టపరంగా చర్యలు ఉంటాయని అన్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ
Maha Kumbh Mela | మాఘ పౌర్ణమి.. 1.83 కోట్ల మంది పుణ్యస్నానాలు