
బోనకల్లు: మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు జవహార్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. వెంకటేశ్వర్లు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాటిలెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్ హెడ్ గా పనిచేస్తున్నారు. ఈయన ఆప్టిమల్ ఆపరేషన్ ఆఫ్ పవర్ సిస్టం విత్ స్టాటిక్ అండ్ ట్రాన్జియంట్ సెక్యూరిటీ కన్స్ట్రెయింట్స్ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.
ఈ సందర్భంగా ఆయనను పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎన్.సురేష్కుమార్, సీనియర్ లెక్చరర్ శివశంకర్, గ్రామస్తులు కళ్యాణ్ వెంకటేశ్వరరావు, కళ్యాణ్ నాగేశ్వరరావు, మాదినేని వీరభధ్రరావు, వేడునూతల లక్ష్మణరావు, వెనిగండ్ల మురళీ, తమ్మారపు బ్రహ్మయ్య, జక్కుల రామారావు, బెల్లంకొండ శ్రీనివాసరావు, తమ్మారపు రామారావు, బెల్లంకొండ రాంబాబు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు అభినందించారు.