
మధిర : పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతిఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. మండల పరిధిలోని మర్లపాడు, మాటూరు గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆయా గ్రామాలోల సర్పంచ్లు, గ్రామసెక్రటరీలను కోవిడ్ టీకాలు, డ్రైడే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్యోగ్య సిబ్బంది పాల్గొన్నారు.