మధిర, ఏప్రిల్ 4 : ఆర్టీసీ రిటైర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధిర ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం స్టాప్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు భిక్షపతి, ఫకీరయ్య మాట్లాడుతూ…ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రిటైర్ ఉద్యోగులకు 2017 నుంచి నూతన పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 2022లో రిటైర్ అయిన ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్ చెల్లించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆర్టీసీ డీఎం శంకర్రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు వెంకటేశ్వర్లు, అప్పారావు, రమేశ్‌కుమార్, వెంకటేశ్వరరావు, అబ్బూరి శ్రీను, కృష్ణారావు, కె.వెంకటేశ్వర్లు, యాదగిరి పాల్గోన్నారు.