‘భట్టి’ శ్రద్ధంతా కమీషన్ల మీదే.. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయండి
డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు ప్రజా సమస్యల కంటే కమీషన్ల మీదే శ్రద్ధ ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఘాటుగా విమర్శించారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- విలేకరుల సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల
మధిర, జూన్ 19 : డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు ప్రజా సమస్యల కంటే కమీషన్ల మీదే శ్రద్ధ ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఘాటుగా విమర్శించారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధిర పట్టణంలో పాలన పూర్తిగా పడకేసిందని, నియోజకవర్గంలో దళారుల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. వానకాలం పంటలకు రైతులు సమాయత్తమవుతున్నా ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. వెంటనే భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
22న బీఆర్ఎస్ సమన్వయకర్తల సమావేశం
ఎస్ఐఆర్ కోసం నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై సమన్వయకర్తలకు అవగాహన సమావేశం ఈ నెల 22న నిర్వహించనున్నట్లు కమల్ రాజు తెలిపారు. ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు హాజరవుతారని పేరొన్నారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యత్వ నమోదు సమన్వయకర్తలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ నాయకులు బికి కృష్ణప్రసాద్, పల్లపోతు వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, బొగ్గుల భాసర్రెడ్డి, కౌన్సిలర్ వైవీ అప్పారావు, కటికల సత్యనారాయణరెడ్డి, బొగ్గుల వీరారెడ్డి, ఆళ్ల నాగబాబు, పరిశా శ్రీనివాసరావు, వేల్పుల శివ, అబ్బూరి రామన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

