మధిర: మండల పరిధిలోని దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండపల్లి నారాయణదాస్ తెలిపారు. పాఠశాలకు చెందిన తీర్ణాల మోక్షిత, తాళ్లూరి రిషీత, షేక్ సమీరాబేగం, బంకా ప్రవీణ్‌కుమార్, పగిడిపల్లి జన్వంత్, జీ.కళ్యాణ్, టీ.మానస, కంచం హారిక, పగిడిపల్లి అదస్థలు ఎంపికయ్యారు. ఈసందర్భంగా గ్రామసర్పంచ్ విజయకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణదాస్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.