మిర్చి మార్కెట్లో దోపిడీని అరికట్టండి..
నగరంలోని వ్యవసాయ మార్కెట్లో గల మిర్చి యార్డులో మధ్యదళారీల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు.
- ఖమ్మంలో మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయం ముట్టడి
- సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటీల డిమాండ్
ఖమ్మం/ఖమ్మం కమాన్బజార్, మార్చి 5 : నగరంలోని వ్యవసాయ మార్కెట్లో గల మిర్చి యార్డులో మధ్యదళారీల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అవునూరి మధు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, తూకాల్లో మోసాలు లేకుండా చూడాలన్నారు. కాగా.. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు డేవిడ్కుమార్, మందుల రాజేంద్రప్రసాద్, బద్దూరి వెంకట్రామిరెడి,్డ వై.ప్రకాశ్, ప్రజల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగ, జిల్లా కార్యదర్శి వై.జానకి, జిల్లా నాయకులు ఐ.వెంకన్న, జి.రమేశ్, న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి పాముల మోహన్రావు, ఎస్కే సుబాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

