Union budget | జూలూరుపాడు, ఫిబ్రవరి 19 : దేశంలో పెట్టుబడుదారులు, కార్పొరేట్ శక్తుల కోసం బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ జూలూరుపాడు మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్లే కార్డులతో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంల్) న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి వల్లోజీ రమేష్, సీపీఎం మండల కార్యదర్శి యాస నరేష్ మాట్లాడుతూ.. దేశంలో 200 మంది శతకోటేశ్వరులపై నాలుగు శాతం సంపద పన్ను ప్రవేశపెట్టాలని, కార్పొరేట్ పన్ను పెంచి వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర హామీ కల్పించాలన్నారు.
భీమా రంగంలో 100% ఎఫ్డీఐ ఉపసంహరించాలని.. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగించటం ఆపాలని కోరారు. ఉపాధి హామీ నిధులు 50% కేటాయింపు పెంచి, పట్టణాలకు వర్తింపజేసి ఆరోగ్య విద్య రంగాలను ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆహార సబ్సిడీ పెంచాలని కోరారు. ఎస్సీ ఎస్టీ రంగాలకు మహిళ శిశు సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కావాల్సిన హక్కులు, బెనిఫిట్స్ కోసం తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నారు.
కార్పొరేటు శక్తులకు వూడిగం చేసే విధంగా..
పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులు సర్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఇది కార్పొరేటు శక్తుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అని.. కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా ఉందని విమర్శించారు. పేదల పొట్టగొట్టి సంపన్న వర్గాలకు రాయితులు కల్పించడం మోడీ అమిత్ షా ఈ దేశాన్ని తెగ నమ్ముతూ కార్పొరేటు శక్తులకు వూడిగం చేసే విధంగా ఉందని విమర్శించారు. బహుళజాతి సామ్రాజ్యవాద గుత్తాధిపత్యాలకు పెట్టుబడుదారుల కబంధ హస్తాల కింద దేశాన్ని తాకట్టు పెడుతున్న మోదీ, అమిత్ షా కుట్రలను ప్రజలు దేశవ్యాప్తంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నాయకులు యల్లంకి మధు, ఎస్కే చాంద్ పాషా, వల్లమళ్ల సామేలు గుడిమెట్ల సీతయ్య, బడుగు వీరాస్వామి, గార్లపాటి శివకృష్ణ, పాలెపు ప్రభాకర్, కొండ హనుమంత్ రావు, ప్రజాపంథ నాయకులు రాయల సిద్దు సీపీఐ (ఎంల్) నాయకులు కూరాకుల నరసింహరావు, జాటోతు నరసింహారావు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎంల్), ప్రజా పంథా జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ
మాధవస్వామి గట్టుపై ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల.. గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ స్థల పరిశీలన