Union Budget | జూలూరుపాడు, ఫిబ్రవరి 18 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 19న మండల కేంద్రాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష కమ్యూనిస్టు పార్టీల నాయకులు సంయుక్తంగా పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఇవాళ జరిగిన కమ్యూనిస్టు పార్టీల అఖిలపక్ష సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు నష్టదాయకంగా ఉందని ఆరోపించారు. బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులైన అదానీ, అంబానీలకు అనుకూలంగా ఉందని ఎద్దేవా చేశారు. మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదలపై భారం వేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని వారు దుయ్యబట్టారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు, కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోత్ కృష్ణ, సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి యాస నరేష్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి వల్లోజి రమేష్, మాస్ లైన్ జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు, మండల కార్యదర్శి బానోత్ ధర్మ, సీపీఐ మండల నాయకులు ఎల్లంకి మధు, చాంద్ పాషా సీపీఎం మండల నాయకులు వల్లమల చందర్ రావు, ఈశ్వర్, అభిమిత్ర తదితరులు పాల్గొన్నారు.
Shamshabad Airport | కార్గో విమానంలో గేర్ సమస్య.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్
Patna firing | పట్నాలో కాల్పుల కలకలం.. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు.. Video