రఘునాథపాలెం, ఫిబ్రవరి 17: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉద్యమ నేత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రఘునాథపాలెం బృహత్ పల్లె ప్రకృతి వనంలో 5 వేల మొక్కలు నాటే లక్ష్యంతో మెగా ప్లాంటేషన్‌కు శ్రీకారం చుట్టారు. మంత్రి పువ్వాడ ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. అనంతరం సీఎం కేసీఆర్ జన్మదిన కేక్‌ను ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఏడున్నర ఏళ్లలో వినూత్న పథకాలతో తెలంగాణను తీర్చిదిద్దారని గుర్తుచేశారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, ఎంపీపీ భుక్యా గౌరి, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో అప్పారావు, డీఎఫ్‌వో ప్రవీణ, డీఆర్డీవో విద్యాచందన, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, మాజీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఆత్మ చైర్మన్ భూక్యా లక్ష్మణ్, రఘునాథపాలెం సర్పంచ్ గుడిపుడి శారద, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, మందడపు నర్సింహారావు, కార్పొటర్లు, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు దేశానికి అవసరమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం ఖమ్మం జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి కేక్ కట్ చేసి మాట్లాడారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ కొత్త పార్టీని స్థాపించినా ప్రజలు స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ అనేక రాష్ర్టాల ముఖ్యమంత్రులు, నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. కేసీఆర్ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. ఫలితంగా రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతున్నదన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఆసరా వంటి పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ర్టాలూ అమలు చేస్తున్నాయన్నారు. అనంతరం పార్టీ కా ర్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. రఘునాథపాలెం మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో 5వేల మొక్కలు నాటే కార్యక్రమం, నగరంలోని పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పాల్గొన్నారు.