అశ్వారావుపేట/ అశ్వారావుపేట రూరల్, ఫిబ్రవరి 28: గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజాపాలన అంటూ వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ తెలంగాణ పాలనలో పూర్తిగా విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మండలంలోని గాండ్లగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 15 కుటుంబాల వారు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మెచ్చా మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో అవినీతి తప్ప.. ఎక్కడా ప్రజాభివృద్ధి కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, చిట్లూరి ఫణీంద్ర, మందపాటి రాజమోహన్‌రెడ్డి, సత్యవరపు సంపూర్ణ, చందా లక్ష్మీనర్సు, మిండా పెద దుర్గారావు, జక్కుల రాంబాబు, చిన్నబ్బాయి, నాని బాబు, మనోహార్, బజారయ్య, శ్రీను, రాంబాబు, గంధం ఆనంద్, తగరం హరి, ఉప్పల మురళి, గాలి రాంబాబు, నాగేశ్వరరావు, చిలకారావు, రమేశ్, సత్యనారాయణ, అశ్వనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలో పర్యటించిన మెచ్చా నాగేశ్వరరావు.. పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు.