భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ చర్ల/ దుమ్ముగూడెం/ భద్రాచలం, సెప్టెంబర్ 29: భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్యపై ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అసమ్మతి గళం వినిపించారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యేకు పట్టింపు లేకపోవడం, తనకు నచ్చిన వారిని పెంచి పోషిస్తూ వాళ్లతో గ్రూపులు కట్టడంపై ఆ పార్టీ నేతలు గతంలోనే అనేకసార్లు బహిరంగ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలకు విసిగి వేసారి మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చర్ల ఎంపీపీ కోదండరామయ్య. వాజేడు ఎంపీపీ శ్యామల సీత, వాజేడు జడ్పీటీసీ పుష్పలత, సర్పంచ్‌లు సరియం సీతారామయ్య, వరస ముద్దరాజు, మడకం నాగేంద్రబాబు, వరస చిన్నారావు, గండి వెంకటేశ్, పాయం తులసి, ఎంపీటీసీలు సోడి రామిశెట్టి, పూసం ధర్మరాజు, మడకం రామారావు, సోడి తిరుపతిరావు, మద్ది వనజ ఉన్నారు. వారితోపాటు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తాండ్ర వెంకటరమణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేశ్‌గౌడ్, రంగారావు, రమేశ్, కుంజా రమాదేవి, మండల అధ్యక్షుడు నరసింహారావు, సీనియర్ నాయకుడు పూర్ణచంద్రరావు, హనుమంతురావు, బండారు సుధాకర్, ఎస్టీ సెల్ సెక్రటరీ తెల్లం నరేశ్, ఉబ్బా వేణు, కోటగిరి సత్యనారాయణ, గుడిపాటి సంతోశ్, దుద్దుకూరి సాయిబాబా ఉన్నారు.