ఖమ్మం రూరల్, డిసెంబర్ 1: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడం, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేయడంతో పలువురు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సమక్షంలో పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసరి వీరభద్రంతోపాటు 32 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరాయి.
వారికి బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాతా, కందాల మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కనకం వీరబాబు, వీరయ్య, నారపొంగు రామకృష్ణ, ఆరెంపుల వీరబాబు, శ్రీను, ఉప్పలయ్య, లింగస్వామి, ఉదర నాగేశ్వరరావు, పుల్లయ్య, వెంకన్న, లింగయ్య, తిరుపయ్య, పుల్లారావు తదితరులు ఉన్నారు.
కూసుమంచి, డిసెంబర్ 1: కోక్యాతండా, కొత్తూరు గ్రామాల్లో వివిధ పార్టీల నుంచి సుమారు 30 మంది మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కోక్యాతండాలో మాజీ సర్పంచ్ పాడ్యానాయక్, మోహన్‌నాయక్, కొత్తూరులో లోడిగ వెంకటరమణ, బజ్జారి ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి ఉపేందర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.