మక్క రైతులు గగ్గోలు
చింతకాని మండలంలో మక్క రైతులు గగ్గోలు పెడుతున్నారు. తగినన్ని కొనుగోలు కేంద్రాల్లేక, పంటను అమ్ముకునే మార్గం కన్పించక ఆర్తనాదాలు చేస్తున్నారు. మండలంలో గతంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ఒకే ఒక్క కొనుగోలు కేంద్రాన్ని తెరిచిందని, అందులో కూడా సరిగా కొనుగోళ్లు జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- చింతకానిలో తగినన్ని కొనుగోలు కేంద్రాల్లేక అన్నదాతల ఆర్తనాదాలు
- గతంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలకు గాను ఈ ఏడాది ఒకే ఒక్కటి..
- ఆ ఒక్క కేంద్రంలోనూ ఎకరానికి 26 క్వింటాళ్లే కొంటున్న అధికారులు
- 30 వేల ఎకరాల్లో సాగు.. 10.80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి..
- ఒకవైపు మద్దతు ధర, మరోవైపు కొనుగోలు కేంద్రాలు లేక అవస్థలు
- కల్లాల్లో పంటను ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న కర్షకులు
చింతకాని, ఏప్రిల్ 5 : చింతకాని మండలంలో మక్క రైతులు గగ్గోలు పెడుతున్నారు. తగినన్ని కొనుగోలు కేంద్రాల్లేక, పంటను అమ్ముకునే మార్గం కన్పించక ఆర్తనాదాలు చేస్తున్నారు. మండలంలో గతంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ఒకే ఒక్క కొనుగోలు కేంద్రాన్ని తెరిచిందని, అందులో కూడా సరిగా కొనుగోళ్లు జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందుకు కూడా ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోందని అంటున్నారు. రైతులు ఎంతో కష్టపడి అధిక మొత్తంలో పంట పండించినా.. ఎకరానికి 26 క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొంటామంటూ తమను ఇబ్బందులపాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి అధికంగా వస్తోందని, అందుకును అనుగుణంగా ఎకరానికి 40 క్వింటాళ్ల వరకూ కొనుగోలు చేయాలని, అది కూడా రూ.2,600 చొప్పున మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ఈ యాసంగిలో రైతులు మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. ఒక్క చింతకాని మండలంలోనే సుమారు 30 వేల ఎకరాల్లో మక్కలు పండించారు. ఇందులో 10.80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. దీంతో రైతులందరూ తమ పంటను కల్లాల్లో ఆరబోసి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. కానీ ప్రభుత్వం ఇంత వరకూ కొనుగోలు కేంద్రాల ఊసే ఎత్తడం లేదు. ఒకవేళ అకాల వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏమిటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదీగాక, ఇప్పటి వరకూ తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడం, అందులోనూ కొర్రీలు పెడుతుండడం, పైగా మద్దతు ధర ఇవ్వకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఏడాది ఎంతో కష్టపడి మొకజొన్న పంటను సాగుచేశామని, ప్రారంభంలో అనేక ఇబ్బందులు పడ్డామని, ప్రభుత్వం యూరియా అందించకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నామని, అప్పులు చేసి మరీ పంటను కాపాడుకున్నామని, చెమటోడ్చి అధిక దిగుబడి సాధించామని కర్షకులు అంటున్నారు. అందులోనూ ఇటీవలి అకాల వర్షాలు కొంతమేరకు పంట కూడా దెబ్బతిన్నందని అంటున్నారు. అయినా, ఎంతో ఆశతో అధిక దిగుబడి సాధిస్తే.. ఈ 26 క్వింటాళ్ల నిబంధన ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 40 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మక్క రైతులను ఎంతగానో ఆదుకున్నదని, కరోనా సమయంలోనూ రైతుల దగ్గరే వచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసిందని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన ధరను కోల్పోతున్నామని అంటున్నారు.
కొర్రీల్లేకుండా కొనుగోలు చేయాలి: ఏఐకేఎంఎస్
బోనకల్లు, ఏప్రిల్ 5: బోనకల్లు మండలంలో మొకజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటుచేయాలని, ఎటువంటి కొర్రీలు లేకుండా రైతుల వద్ద ఉన్న పూర్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు డిమాండ్ చేశారు.
బోనకల్లు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని ఆదివారం వారు పర్యటించి.. మొకజొన్న కల్లాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా కేవలం 31 కేంద్రాల ఏర్పాటుకే ప్రభుత్వం ఆదేశాలివ్వడం సరికాదని అన్నారు. అవసరమైన ప్రతి చోటా కేంద్రాలను తెరవాలని, 26 క్వింటాళ్ల మాత్రమే కొంటామనే నిబంధనను ఎత్తివేయాలని, రైతుల వద్ద ఉన్న ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు.గిరి, వెంకటేశ్వర్లు, గోవిందరావు, కొండలరావు, కృష్ణవేణి, రవి, అఖిల్, రమ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

