తిరుమలాయపాలెం, మే 7: సొంత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండల అభివృద్ధిఫై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో అత్యంత కరువు పీడిత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలం తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సస్యశ్యామలంగా మారిందన్నారు.
ప్రభుత్వం పూర్తిచేసిన శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకం వల్ల ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని పేర్కొన్నారు. సభ్యులు అడిగిన అభ్యర్థనల మేరకు మండలంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించారు. తొలిసారిగా సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ తాతా మధును సన్మానించారు. సమావేశంలో ఎంపీపీ బోడ మంగీలాల్, జడ్పీటీసీ బెల్లం శ్రీనివాసరావు, ఎంపీడీవో జయరామ్, తహసీల్దార్ పుల్లయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
చెరువులు నింపాలని తాతా మధుకు వినతి
మండలంలోని గ్రామాల్లో శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపాలని సీపీఎం నాయకులు తిరుమలాయపాలెంలో శనివారం ఎమ్మెల్సీ తాతా మధును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, నాయకులు కొమ్ము నాగేశ్వరరావు, ఎస్కే ఇమాం Congress cannot touchపాల్గొన్నారు.