ఖమ్మం, సెప్టెంబర్ 8: రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పలు పార్టీల నాయకుల, ప్రజా సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయనను కలిసి శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందించి విషెస్ చెప్పారు.
ఈ సందర్భంగా ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవాలయం నుంచి ప్రత్యేకంగా వచ్చిన అర్చకులు మంత్రి పువ్వాడకు వేదాశీర్వచనాలు ఇచ్చి భద్రాద్రి రామయ్య ప్రసాదాలను అందజేశరు.
ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ, జడ్పీ, సుడా చైర్మన్లు కూరాకుల నాగభూషణం, లింగాల కమల్‌రాజు, బచ్చు విజయ్‌కుమార్,
ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డీవీ, బీఆర్ఎస్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, దిండిగాల రాజేందర్, వల్లభనేని రామారావు, గూడపాటి శ్రీనివాస్, ఫాతిమా, కర్నాటి కృష్ణ, కమర్తపు మరళి, నీరజ, రోజ్లీనా, చిరుమామిళ్ల లక్ష్మి, మోతారపు శ్రావణి, రావూరి కరుణ, దాదే అమృతమ్మ, మందడపు లక్ష్మి, పసుమర్తి రామ్మోహన్రావు, కన్నం వైష్ణవి, షకీనా, శీలంశెట్టి వీరభద్రం, పొన్నం వెంకటేశ్వర్లు, టీఎన్జీవోస్ నాయకులు అఫ్జల్‌హసన్, ఆర్వీఎస్ సాగర్, నందగిరి శ్రీను, దాసరి రవికుమార్, శాబాసు జ్యోతి, స్వప్న తదితరులు శాలువాలు కప్పి మంత్రిని సతరించారు. అనంతరం మంత్రితో కేక్ కట్ చేయించారు.