టేకులపల్లి, ఏప్రిల్ 20 : ఆదివారం టేకులపల్లి మండల కేంద్రం తాసిల్దార్ కార్యాలయ ఆవరణంలో తాసిల్దార్ నాగ భవాని అధ్యక్షతన భూభారతి నూతన చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే కోరం కనకయ్యలు పాల్గొని నూతన చట్టం పై అవగాహన కల్పించారు. ఈ చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతుందని, ప్రతి భూమి నెంబర్ కు ఒక ఐడీ ఇస్తామన్నారు.
రైతు పట్టా పుస్తకంలో పొలం మ్యాపింగ్ ఏర్పాటుతో భూములకు రక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఇల్లందు వ్యవసాయ శాఖ ఏడీఏ లాల్‌చంద్, ఎంపీడీవో రవీందర్రావు, సీఐ సురేష్, సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, స్థానిక నాయకులు కోరం సురేందర్, సొసైటీ డైరెక్టర్లు, ఏవో అన్నపూర్ణ, డిప్యూటీ తాసిల్దార్ ముత్తయ్య, ఎంపీవో గణేష్ గాంధీ, స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.