వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతి గురించి సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పనులను త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
- డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించిన కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతి గురించి సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పనులను త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
వివిధ బ్లాక్‌లతోపాటు బాయ్స్, గర్ల్స్ హాస్టల్, తరగతి గదులు, ల్యాబోరేటరీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని, ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతానికి కళాశాల ప్రధాన భవనాలు, హాస్టల్ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కళాశాలలో ప్రతీ ఏడాది 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అలాగే నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, వసతి, తరగతి గదులు, ల్యాబోరేటరీలు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయా? ఇంకా ఏమైనా అదనపు వసతులు అవసరమా? అనే అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట వైద్య, ఇంజినీరింగ్, నిర్మాణ శాఖల అధికారులు, నర్సింగ్ కళాశాల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

