సీఎం కేసీఆర్‌తోనే పల్లెలకు నూతన ఒరవడి
సీఎం కేసీఆర్‌తోనే గ్రామాలకు నూతన ఒరవడి రావడం జరిగిందని ఎమ్మె ల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ కేటగిరిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పంచాయతీలకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డులను సర్పంచ్‌లకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు ప్రశాంస పత్రాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు.
ఖమ్మం రూరల్, మార్చి 23: సీఎం కేసీఆర్‌తోనే గ్రామాలకు నూతన ఒరవడి రావడం జరిగిందని ఎమ్మె ల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ కేటగిరిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పంచాయతీలకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డులను సర్పంచ్‌లకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు ప్రశాంస పత్రాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ రాష్ట్ర సాధనకు ముందు, తరువాత పంచాయతీలను పోల్చుకుంటే అనేక మార్పులు వచ్చాయన్నారు. దశాబ్దాల తరబడి కనపడని అభివృద్ధి నేడు పల్లెలలో కనపడుతుందన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం, పరిశుభ్రత, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గ్రామపంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఈ నెల31వ తేదీ లోపు విడుదల చేయడం జరుగుతుందన్నారు. సర్పంచ్‌లు ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు. అవార్డులు స్వీకరించిన సర్పంచ్, సెక్రటరీలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ, యండపల్లి వరప్రసాద్, ఎంపీడీఓ అశోక్‌కుమార్, ఎంపీఈవో శ్రీనివాసరావు, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బీకునాయక్ కుటుంబాన్ని పరామర్శ
మండలంలోని తీర్థాల గ్రామానికి చెందిన బీకు నాయక్ ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి గురువారం నాయక్ కుటుంల సభ్యులను పరామర్శించారు. తొలుత బీకు నాయక్ చిత్రపటానికి నివాళి అర్పించి రూ.10వేలు అందజేశారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
కూసుమంచి, మార్చి 23: వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 69 మందికి మంజూరైన రూ. 24.44 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గురువారం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, రైతు బంధు సమితి కన్వీనర్ బానోత్ రాంకుమార్, చాట్ల పరశురాం, పాపిరెడ్డి, మంగ్యా నాయక్, పుట్ట అంజయ్య, నెల్లూరి వీరభద్రం, అలీ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- cheques
- CM KCR
- CMRF
- corn farmers
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

