కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 27: ఆస్తుల పరిరక్షణ, అవినీతి అక్రమాలను అరికట్టడం, సంస్థ నిధులు దుర్వినియోగం కాకుండా చూడడంలో సింగరేణి విజిలెన్స్ అధికారుల పాత్ర కీలకమని సంస్థ సీఎండీ బలరాం అన్నారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సింగరేణి విజిలెన్స్ అధికారులతో శాఖ కార్యకలాపాలపై సంస్థ సీఎండీ బలరాం శుక్రవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజిలెన్స్ విభాగం సింగరేణికి వెన్నెముక అని అన్నారు. అవినీతిని అరికట్టడంలో ఎటువంటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్లాలని, ఇందుకోసం యాజమాన్యం పూర్తి సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జీఎం ఈఅండ్ఎం విజిలెన్స్ ప్రసాదరావు, విజిలెన్స్ అధికారులు వీరయ్య, రాంచందర్, పీవీఎస్ శాస్త్రి, రామకృష్ణ, సమ్మయ్య, ఎండీ హషీంపాషా తదితరులు పాల్గొన్నారు.