కూసుమంచి(నేలకొండపల్లి), ఏప్రిల్ 30: రాష్టంలో నిరుపేదలకు వైద్య సహాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏడాదిలో రూ.1070 కోట్ల ఆర్ధిక సహాయం అందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు రూ.23.33లక్షలు, 35 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో నర్సింహారావు, తహసీల్దార్ కరుణశ్రీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.