ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నగరంతోపాటు నియోజకవర్గ పరిధిలోని మండల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండాలు, కండువాలు, టోపీలు ధరించి రావడంతో సభా ప్రాంగణం గులాబీమయమైంది. వేదికపైకి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగిడగానే ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్’ అనే నినాదాలు మారుమోగాయి. ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని, ఆనాటి ఖమ్మాన్ని, ఈనాటి ఖమ్మం అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని ప్రజలు శ్రద్ధగా విన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరడంతో ప్రజలు చేతులెత్తి మద్దతు పలికారు.