బకాయిలు ఎందుకు చెల్లించలేదు?
సిరిసిల్ల నేతన్నలకు నిధులు విడుదలైనా బకాయిల చెల్లించకపోవడంపై చేనేత జౌళి శాఖ కమిషనర్ ఫైర్ అయ్యారు. చేనేత బకాయిలు, ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ సందిగ్ధంపై ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘నేతన్నకు 200 కోట్ల బకాయిలు’ కథనానికి చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజరామయ్యర్ స్పందించారు.
- అధికారులపై చేనేత జౌళి శాఖ కమిషనర్ ఫైర్
- ‘నేతన్నకు 200 కోట్ల బకాయిలు’ కథనంపై స్పందన
రాజన్న సిరిసిల్ల, మార్చి 2 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల నేతన్నలకు నిధులు విడుదలైనా బకాయిల చెల్లించకపోవడంపై చేనేత జౌళి శాఖ కమిషనర్ ఫైర్ అయ్యారు. చేనేత బకాయిలు, ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ సందిగ్ధంపై ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘నేతన్నకు 200 కోట్ల బకాయిలు’ కథనానికి చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజరామయ్యర్ స్పందించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి, వివరాలు సేకరించినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికలకు ముందే బకాయిలు చెల్లించాలని చెప్పినా.. ఎందుకు పెండింగ్ పెట్టారని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. బకాయిలతోపాటు ఇందిరమ్మ చీరల తయారీ బిల్లులను వెంట వెంటనే చెల్లించాలని ఆదేశించినట్టు తెలిసింది. కాగా బకాయిలను సిరిసిల్లకు చెందిన ఓ కాంగ్రెస్ నేత చెబితే నిలిపివేసినట్టు అధికారులు చెప్పగా, వారిపై ఆమె అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం. చీరల తయారీ సజావుగా నిర్వహించాలని సూచించినట్టు తెలిసింది.
ఇంకా చదవల్సిన వార్తలు
ఉర్దూపై విద్యాకమిషన్ చిన్నచూపు ; మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకుబ్పాషా
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలోని తెలంగాణ విద్యాకమిషన్ రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా చలామణి అవుతున్న ఉర్దూపై చిన్నచూపు చూసిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకుబ్పాషా ఆక్షేపించారు. ఉర్దూ స్కూళ్లు, మదర్సాలను విస్మరించడం దురదృష్టకరమని సోమవారం ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,221 ప్రైమరీ, 240 ఉన్నత ఉర్దూమీడియం పాఠశాలల అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం శోచనీయమని వాపోయారు. విద్యార్థులు లేరనే సాకుతో ఉర్దూ స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చుతున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సుధీర్ కమిషన్ మదర్సాబోర్డు ఏర్పాటు చేయాలని, అరబిక్, ఉర్దూలతో పాటు ఆంగ్లాన్ని బోధించాలని నొక్కిచెప్పిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత తెలంగాణ విద్యాకమిషన్ విస్మరించడం ఎంతవరకు సమంజసనమని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఉర్దూ మీడియం స్కూళ్లు, మదర్సాలను కాపాడాలని విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

