Face book | ఫేస్బుక్ డౌన్.. సేవల్లో ఆకస్మిక అంతరాయం.. వెల్లడించిన డౌన్ డిటెక్టర్
Face book | ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే సోషల్ మీడియా (Social Media) వేదికల్లో ఒకటైన ఫేస్బుక్ (Face book) సేవల్లో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడింది. దాంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు డౌన్‌డిటెక్టర్ (Down Detector) వెబ్సైట్ వెల్లడించింది.
Face book : ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే సోషల్ మీడియా (Social Media) వేదికల్లో ఒకటైన ఫేస్బుక్ (Face book) సేవల్లో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడింది. దాంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు డౌన్‌డిటెక్టర్ (Down Detector) వెబ్సైట్ వెల్లడించింది. ఫేస్బుక్ అంతరాయం కారణంగా చాలామంది వినియోగదారులు తమ ఫేస్బుక్ ఖాతాల్లోకి లాగిన్ కాలేకపోయినట్లు వెల్లడించారు. కొందరు లాగిన్ అయినప్పటికీ పోస్టులు చేయడం, ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేయడం, న్యూస్ ఫీడ్‌ను చూడడం వంటి ముఖ్యమైన ఫీచర్లు పనిచేయలేదని పేర్కొన్నారు.
ఫేస్బుక్ మెసెంజర్ సేవల్లో కూడా కొంతమందికి అంతరాయం కలిగింది. మెసేజస్ పంపడం, స్వీకరించడం వంటి సౌకర్యాలు సరిగా పనిచేయకపోవడంతో వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యారు. బహుశా సాంకేతిక సమస్యల కారణంగా ఈ అంతరాయం కలిగి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ సమస్య భారతదేశంతోపాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, టర్కీ మొదలైన దేశాల్లో కూడా తలెత్తింది. ఆయా దేశాల్లో కూడా ఫేస్బుక్ సేవలు నిలిచిపోయాయని ఫిర్యాదులు వచ్చాయి. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సాంకేతిక సమస్యగా భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

