IND vs ENG | పవర్ ప్లేలో ఇంగ్లండ్ దూకుడు.. వికెట్ కోసం భారత బౌలర్ల అపసోపాలు..!
IND vs ENG : లార్డ్స్‌లో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు దంచేస్తున్నారు. బుమ్రా గైర్హాజరీలో బెన్ డకెట్ (22 నాటౌట్), జాకబ్ బెథెల్ (25 నాటౌట్) వికెట్ కాచుకొని శుభారంభమిచ్చారు.
IND vs ENG : లార్డ్స్‌లో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు దంచేస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలోని భారత పేస్ దళాన్ని దీటుగా ఎదుర్కొన్న బెన్ డకెట్ (22 నాటౌట్), జాకబ్ బెథెల్ (25 నాటౌట్) వికెట్ కాచుకొని శుభారంభమిచ్చారు. ఫలితంగా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా ఆతిథ్య జట్టు 58 పరుగులు చేసింది. క్రీజులో పాతకుపోయిన ఈ జోడీని విడదీసేందుకు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలర్లను మార్చినా లాభం లేకపోయింది.
సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డలో భారత బౌలర్లు తేలిపోతున్నారు. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్ (22 నాటౌట్), జాకబ్ బెథెల్ (25 నాటౌట్)లు ఆచితూచి ఆడడంతో వికెట్ తీసేందుకు అపసోపాలు పడుతున్నారు. బుమ్రా లేకపోవడంతో.. వికెట్ తీసే బ్రేకిచ్చే బౌలర్ కరువయ్యాడు. దాంతో, ఇంగ్లండ్ ఓపెనర్లు క్రీజునంటుకుపోయి పవర్ ప్లేలో 58 రన్స్ పిండుకున్నారు. భారత బౌలర్లు ప్రసిధ్, అర్ష్‌దీప్, ప్రిన్స్ యాదవ్‌లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో డకెట్, బెథెల్ ఆతిథ్య జట్టుకు భారీ స్కోరందించే పనిలో నిమగ్నమయ్యారు.
We’re 🔟 overs in at Lord’s…
With Ben Duckett 22* (29) and Jacob Bethell 25* (31) making a solid start out there 👊
🏴 5️⃣8️⃣-0️⃣ pic.twitter.com/rK0pXWzmr3
— England Cricket (@englandcricket) July 19, 2026
సోబర్స్‌కు నివాళి
వెస్టిండీస్ దిగ్గజం గ్యారీఫీల్డ్ సోబర్స్(Garry Sobers) మృతితో క్రీడాలోకం విచారంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ స్వగృహంలో కన్నుమూసిన ఆయనకు లార్డ్స్ మైదానంలో నివాళులు అర్పించారు. ఆదివారం మూడో వన్డేకు ముందు భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు మైదానంలో సోబర్స్ గౌరవార్థం ఒక నిమిషం మౌనం పాటించారు. టెస్టుల్లో వెటరన్ ఆల్‌రౌండరైన అతడిని తలచుకుంటూ.. ఇరుదజట్ల ప్లేయర్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించారు.
A minute’s silence was observed at Lord’s in honour of the late Sir Garry Sobers pic.twitter.com/mCz8yNq2RQ
— Cricinfo (@cricinfo) July 19, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

