Cartoonist Shankar | కేసీఆర్ నన్ను హగ్ చేసుకున్నరు.. నా లైఫ్‌లో జరిగిన అద్భుతం అదే : కార్టూనిస్ట్ శంకర్
Cartoonist Shankar | కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు-2026 ప్రదానోత్సవ సభ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది.ఈ సందర్భంగా కేసీఆర్‌పై వేసిన కార్టూన్ గురించి కార్టూనిస్ట్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Cartoonist Shankar | కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు-2026 ప్రదానోత్సవ సభ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై వేసిన కార్టూన్ గురించి కార్టూనిస్ట్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కార్టూనిస్ట్ శంకర్ మాట్లాడుతూ.. 2005లో నా ఎగ్జిబిషన్ ప్రోగ్రాం పెట్టాం. ఆ కార్యక్రమానికి కేసీఆర్, చిరంజీవి వచ్చారు.. అప్పుడు కేసీఆర్ కర్లీగా ఒత్తుగా రింగు రింగుల జుట్టు ఉంటుండే. కార్టూనిస్టులు సాధారణంగా ఐడెంటిపికేషన్ కోసం ఓ క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకుంటరు. కేసీఆర్ నెత్తిలో తెలంగాణ మ్యాప్ బాగా కుదిరింది. ఆ ఎగ్జిబిషన్‌ను చిరంజీవి ప్రారంభించిండు. మెగా షోకు మెగాస్టార్ అని హెడ్‌లైన్స్‌లో వస్తే.. కేసీఆర్ అది చూసి ఆ అబ్బాయిని లంచ్ పిలుద్దామన్నారు.
అసలు ఓ పొలిటికల్ లీడర్ ఏమన్నా ఉంటే నా మీద ఇట్లా వేసిండని కేసు పెడ్తరు. లంచ్‌కు పిలవడం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. పిలిచినా రూమ్‌లో వేసి ఏమన్నా చేస్తరా..? ఫీచర్స్ కుదిరినయా.. లేవా..? నా వెర్షన్లో ఇలా అనుకోని వేసిన వాళ్లకు ఎట్లుందో ఫ్యామిలీ పరంగా బయటినుంచి చూస్తే ఎట్లుందో.. అనిపించింది. ఒక మధ్యవర్తి వచ్చిండు..నన్ను లంచ్‌కు తీసుకొని పోయిండు. తిన్న తర్వాత ఆయన నెత్తిన వేలు పెట్టి ఏమో అంటుండు ఏంది అని చిరంజీవి నన్ను అడిగారు.
నెత్తిల తెలంగాణ ఎందుకేసినవ్ అని చిరంజీవి నన్ను అంటే.. నువ్వేం చెప్పినవ్ అని కేసీఆర్ అడిగారు. ‘తల తాకట్టు పెట్టైనా తెలంగాణ తెస్తా’ అంటే కేసీఆర్ నన్ను హగ్ చేసుకున్నరు. బహుశా నా లైఫ్‌లో ఒక అద్భుతం జరిగిందంటే అదేనేమో అని చెప్పుకొచ్చారు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2005లో ఓ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంలో కేసీఆర్ జుట్టుతో తెలంగాణ చిత్రపటం కార్టూన్ గీశాను
అప్పట్లో కేసీఆర్‌కు వొత్తుగా రింగు రింగుల జుట్టు ఉండేది
ఆ కార్యక్రమానికి కేసీఆర్, చిరంజీవి వచ్చారు.. నేను గీసిన కార్టూన్ చూసి నన్ను ఇంటికి లంచ్‌కు పిలిచారు
నేను కోపంతో పిలిచాడేమో అని భయంభయంగా… https://t.co/1AsbeJ8OFX pic.twitter.com/bGm39uOZ8S
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2026
తెలంగాణ ఉద్యమ సమయంలో తల తాకట్టు పెట్టి అయినా సరే తెలంగాణ తెస్తాడు అంటూ కేసీఆర్ మీద కార్టూనిస్ట్ శంకర్ వేసిన కార్టూన్ https://t.co/PF0WOt6lI4 pic.twitter.com/2oJFwVqECB
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2026
Read ALso :
Sircilla | అంతర్జాతీయ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు.. విక్రమ్-1 విజయంలో కీలక పాత్ర
Tragedy | పెళ్లయిన 15 రోజుల్లోనే విషాదం.. బైక్‌పై నుంచి కిందపడి నవ వధువు మృతి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

