పాల్వంచ, మార్చి 29 : పాల్వంచ కేటీపీఎస్ 6వ దశలో నిర్మాణ కార్మికులుగా పనిచేసిన వారిని ఆర్టీజన్లుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం ఐదవ రోజుకు చేరాయి.
దీక్షలను సీఐటీయూ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు దొడ్డా రవికుమార్ మాట్లాడుతూ 6వ దశ నిర్మాణంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి పునాది దగ్గర నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగే వరకు పనిచేసిన కార్మికులను నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్లగొట్టారని, వారందరినీ యాజమాన్యం ఆర్టీజన్లుగా తీసుకోవాలన్నారు. టీజీ జెన్కో యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి 418 మందిని బేషరతుగా ఆర్టీజన్లుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాతోజు సత్య, జెన్కో యూఈఈయూ అధ్యక్షుడు అంకిరెడ్డి నరసింహారావు, నిర్మాణ కార్మికుల నాయకుడు హతీరాం పాల్గొన్నారు.