Harshit Rana : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ సమీపిస్తున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)ను గాయాలు వెంటాడుతున్నాయి. గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రానా (Harshit Rana) మెగా ఈవెంట్‌కు దూరమయ్యేలా ఉన్నాడు. పొట్టి ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లో గాయపడి టోర్నీ మొత్తానికి దూరమైన ఈ పేస్ ఆల్‌రౌండర్ ఇంకా కోలుకోలేదు. తాజా వీడియోలో అతడు కర్ర సాయంతో నడుస్తూ మీడియాకు చిక్కాడు. దాంతో, ఈ సీజన్లో కేకేఆర్ ఈ పొడగరి పేసర్ సేవల్ని కోల్పోవడం ఖాయమనిపిస్తోంది.
పంతొమ్మిదో సీజన్లో పుంజుకోవాలనుకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బౌలింగ్ కష్టాలు మొదలయ్యాయి. గత కొన్ని సీజన్లుగా కోల్‌కతా పేస్ దళంలో భాగమైన హర్షిత్ రానా ఈసారి ఆడడం అనుమానంగానే ఉంది. టీ20 వరల్డ్‌కప్ ముందర దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్‌లో మోకాలి గాయంతో నిష్క్రమించిన రానా.. ఐపీఎల్ ఆరంభానికల్లా అతడు ఫిట్నెస్ సాధిస్తాడని కోల్‌కతా ఆశించింది. కానీ, ఈ పొడగరి పేసర్ మాత్రం ఇంకా కోలుకోలేదు.
Harshit Rana’s injury is quite serious. He is not able to walk properly and is using a stick to walk. Even then, he came to the Naman Awards show today. If he had not come, it would have been completely understandable. Because of this injury, he will also not play in this year’s… pic.twitter.com/KIGdiSdHYV
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 15, 2026
తాజాగా అతడు కర్ర సాయంతో కుంటుతూ నడుస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. దాంతో, పంతొమ్మిదో సీజన్‌కు రానా అందుబాటులో ఉండడం కష్టమే అనిపిస్తోంది. ఇప్పటికే వేలంలో భారీ ధరకు కొన్న ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను సైతం కోల్‌కతా వదులుకుంది.
ఇప్పుడు రానా కూడా ఆడని పరిస్థితుల్లో ఫాస్ట్ బౌలింగ్ భారాన్ని వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరబని, ఉమ్రాన్ మాలిక్, ఆకాశ్ దీప్, కార్తిక్ త్యాగిలు మోయాల్సి వస్తుంది. గత మూడు సీజన్లుగా కోల్‌కతాకు ఆడుతున్న రానా 34 మ్యాచుల్లో 40 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో అజింక్యా రహానే సారథ్యంలో తీవ్రంగా నిరాశపరిచిన కోల్‌కతా.. ఈసారి మార్చి 29న తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.