భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతీ బూత్ స్థాయిలో 2002-ఎస్ఐఆర్ డేటాను 2025తో సరిచూసుకుని రెండు జాబితాల్లో కామన్‌గా ఉన్న పేర్లను మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వివరాలను ధ్రువీకరించాలన్నారు.
ఈ పనిని 24వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. అనంతరం వీసీలో పాల్గొన్న కలెక్టర్ ఐడీవోసీలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ఓటర్ల జాబితాను తయారు చేసుకుని పూర్తి వివరాలతో కచ్చితమైన రిపోర్టు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఆర్డీవో మధు, ఎన్నికల అధికారి రంగాప్రసాద్, ఏఈఆర్వోలు దారా ప్రసాద్, పుల్లయ్య పాల్గొన్నారు.