కారేపల్లి, ఆగస్టు 23 : రాష్ట్రానికి యూరియా సరఫరాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్షత, ముందుచూపులేని రాష్ట్ర ప్రభుత్వ చేతలతో రైతులు ఘోస పడుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొంతు రాంబాబు అన్నారు. శనివారం కారేపల్లి మండలం పాటిమీదిగుంపులో మాజీ సర్పంచ్, అమరజీని కరపటి రాములు 12వ వర్ధంతి నిర్వహించారు. పార్టీ పతాకాన్ని కరపటి సీతారాములు అవిష్కరించారు. ఈ సందర్బంగా దారావత్ వినోద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో బొంతు రాంబాబు మాట్లాడుతూ.. యూరియా కొరతకు బాధ్యులు మీరంటే మీరని కేంద్ర, రాష్ట్ర పాలకులు ఆరోపించుకుంటూ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రైతులు సాగు పనులు పక్కన పెట్టి యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్ధితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాపై రైతులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో రైతుల్లో అసహనం పెరిగి స్వచ్ఛందంగా రోడ్డెక్కుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కె.నరేంద్ర, డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా రామారావు, మండల కమిటీ సభ్యులు సురభాక ధనమ్మ, వల్లెబోయిన కొండలరావు, యనమనగండ్ల రవిబాబు, సురభాక సర్వయ్య, మాజీ సర్పంచ్ కరపటి రాంబాయి, నాయకులు కరపటి లక్ష్మయ్య, మన్నెం బ్రహ్మయ్య, ధరావత్ రవికుమార్, బచ్చల వెంకన్న, బచ్చల బుజ్జమ్మ, ధరావత్ సరిత, అంగడి వెంకన్న, ధరావత్ లాలు, ఈసం వీరస్వామి, భూక్య శ్రీను, వెంకటేశ్, మన్సూర్ పాల్గొన్నారు.