కారేపల్లి, మార్చి 19 : సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యం కావడంతో బుధవారం ఖమ్మం జిల్లా కరేపల్లిలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. కారేపల్లి అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహంతో పాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిచారు. ఈ సందర్భగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. వర్గీకరణ కోసం ఎంతోమంది త్యాగాలు చేసినట్లు చెప్పారు. వర్గీకరణకు మద్దతు పలికిన రాజకీయ పక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మదర్ ధెరిస్సా గోల్డ్మెడల్ అవార్డు గ్రహీత ఆదెర్ల శంకర్, కళకారుడు పాటమ్మ నాగేంద్రబాబు, ఎమ్మార్పీఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి సంజీవరావు, జిల్లా నాయకులు ఆదెర్ల అంజయ్య, ఆదెర్ల రాములు, రాయల శ్రీనివాస్, కేసగాని బాలకృష్ణ, అలగాడి ఉపేందర్, ఆదెర్ల ఉపేందర్, ఆదెర్ల రామారావు, నాగరాజు వినయ్, వడ్లకొండ సాంబ, గిట్టగనుపుల సాంబ, ఆదెర్ల గౌతం, కొమ్ము జ్ఞానయ్య పాల్గొన్నారు.