కూసుమంచి, మార్చి 1: పాలేరు పాతకాలువ ఆయకట్టు రైతులు అనేకసార్లు వరుసగా అనధికారికంగా దిగువకు జలాలు వదులుతుండడంతో ఇరిగేషన్ అధికారులు శుక్రవారం కాలువ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి నుంచి ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల పుటేజీని నిత్యం పరిశీలిస్తారు.