మణుగూరు టౌన్, ఏప్రిల్ 5: వరంగల్లో ఈ నెల 27వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ మహాసభకు ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పంచాయతీలు, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
ఈ నెల 7 నుంచి 25వ తేదీలోపు అన్ని వార్డులు, పంచాయతీల్లో జెండా దిమ్మెలు ఏర్పాటు చేసుకొని పండుగ వాతావరణంలో జెండా ఆవిష్కరణలు చేసుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ మండల అధ్యక్షులు పంచాయతీల్లోని కార్యకర్తలను సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.