మధిర, అక్టోబర్ 07 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం చింతకాని మండల కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా ఎంపిక చేసేలా ప్రణాళికలు రచించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, రైతు నాయకులు మంకేన రమేశ్, పొనుగోటి రత్నాకర్, గడ్డం శ్రీను, సొసైటీ చైర్మన్ తాతా ప్రసాద్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కన్నెబోయిన కుటుంబరావు, యువజన నాయకులు పిన్నెల్లి శ్రీనివాస్, కోపూరి నవీన్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.