పెనుబల్లి/తల్లాడ, మే 9 : కీర్తిశేషులు రాయల శేషగిరిరావు విగ్రహావిష్కరణకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. హెలీప్యాడ్ దిగిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తుండగా మిట్టపల్లి పరిసర ప్రాంతం ఒక్కసారిగా గులాబీమయంగా మారింది.
గజమాలతో ఆయనకు స్వాగతం పలికి మిట్టపల్లి సెంటర్కు చేరుకోవడంతో గులాబీ పూలవర్షం కురిసినట్లుగా ఆయనపై గులాబీ పూలు చల్లారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. బంజారా మహిళలు నృత్యాలతో ముందుకు సాగుతుండగా ఆదివాసీ మహిళలు వారి సంప్రదాయం ప్రకారం నృత్యం చేస్తూ సభా ప్రాంగణానికి తీసుకొని వచ్చారు. దీంతో ఆ పరిసర ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొనడం ప్రతిఒక్క కార్యకర్తలో ఉల్లాసం, ఉత్సాహాన్ని నింపింది.