చింతకాని, నవంబర్ 7: కాంగ్రెస్ చెప్పేవి ఆరు గ్యారెంటీ హామీలు కావని.. నూరు అబద్ధాలని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు విమర్శించారు. ప్రజాక్షేత్రంలో గెలువలేకనే ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి అబద్ధాల కాంగ్రెస్ నాయకులకు ఓటు ద్వారానే బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. గడిచిన పదేళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని గమనించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మధిర నియోజకవర్గం నుంచి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. చింతకాని మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన.. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి కొదుమూరు, వందనం, రాఘవాపురం, లచ్చగూడెం, నరసింహపురం, నేరడ, చింతకాని, రేపల్లెవాడ, పాతర్లపాడు, రైల్వేకాలనీ, నాగులవంచ తదితర గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అద్భుత అభివృద్ధి జరిగిందని, ఆ అభివృద్ధిని గమనించి బీఆర్ఎస్ భారీ మెజార్టీ అందించాలని కోరారు. నియోజకవర్గంలో అను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న తనను ఆదరించాలని కోరారు.
గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమిటో, ఇప్పటి వరకూ నియోజవకర్గంలో ఎమ్మెల్యే భట్టి చేసిన అభివృద్ధి ఏమిటో గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరారు. గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను ఇదే అంశాలపై ప్రశ్నించాలని సూచించారు. చివరికి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పథకాలను కూడా కాపీ కొట్టారని, వాటినే కొద్దిగా మార్చి గ్యారెంటీ హామీలంటూ చెబుతున్నారని దుయ్యబట్టారు. టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపైనా ఉందని అన్నారు. కాగా, ఆయా గ్రామాల్లోని ప్రజలు కమల్రాజుకు, కోటేశ్వరరావుకు పూలతో ఘన స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పర్చగాని తిరుపతి కిశోర్, పెంట్యాల పుల్లయ్య, కోపూరి పూర్ణయ్య, కురుగుంట్ల రవీందర్రెడ్డి, మంకెన రమేశ్, అంకిరెడ్డి రాఘవరెడ్డి, బొగ్గారపు రాంబాబు, బొడ్డు వెంకట్రామయ్య, తాతా ప్రసాద్, గురజాల హనుమంతరావు, దొబ్బల నాగేశ్వరరావు, కన్నెబోయిన కుటుంబరావు, నూతలపాటి వెంకటేశ్వర్లు, వంకాయలపాటి సత్యనారాయణ, దాసరి వెంకటేశ్వర్లు, ఆలస్యం శంకర్, పఠాన్ షబ్బీర్ఖాన్, గడ్డం శ్రీనివాసరావు, శేషగిరి, సర్పంచులు కాండ్ర పిచ్చయ్య, గురజాల ఝాన్సీ, బండి సుభద్ర, దొడ్డా ప్రవీణ, కే.సునిత, యలమంద, తుడుం రాజేశ్, చాట్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.