కారేపల్లి,ఫిబ్రవరి 1 : రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షను తుంగలో తొక్కి ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతూ ఆరాచక పాలన సాగిస్తున్నారని ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీలు వాంకుడోత్ జగన్, ఉన్నం వీరేందర్ ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ సర్కార్ అక్రమంగా పెడుతున్న కేసులను నిరసిస్తూ ఆదివారం కారేపల్లి క్రాస్ రోడ్ లో ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు భారీ రాస్తారోకో నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఏ హామీని సక్రమంగా అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్ప్పుదారి పట్టించటానికి ఫోన్ టాపింక్ పేరుతో తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్పై కక్షకట్టి వేధింపులకు పాల్పడుతుందన్నారు. రాష్ట్రంలో రైతులకు సక్రమంగా యూరియా అందించలేని చేతగాని ప్రభుత్వముందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం పోయి, రాక్షస రాజ్యం వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక చర్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించినట్లు తెలిపారు.