మణుగూరు టౌన్/ మధిర, ఏప్రిల్ 26: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామగ్రామాన గులాబీ జెండా పండుగ నిర్వహించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు.
పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం ప్రతీ గ్రామంలో గ్రామ అధ్యక్షులు, మండలాల్లో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జెండాను ఎగురవేయాలని కోరారు. పార్టీ శ్రేణులన్నీ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ రజతోత్సవ పండుగ పార్టీ ప్రస్థానంలో ఒక కీలక ఘట్టమని గుర్తుచేశారు. ఇందులో ప్రతి కార్యకర్తా భాగస్వామి కావాలని కోరారు.