ముదిగొండ, నవంబర్ 8 : వ్యక్తిగత విమర్శలు చేయటం కాదని, నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చె ప్పాలని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్య ర్థి లింగాల కమల్‌రాజు.. మధిర ఎమ్మెల్యే భట్టిని ప్రశ్నించారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి భట్టి చేసింది శూన్యమని విమర్శించారు. ముదిగొండ మండలంలో బుధవారం పర్యటించిన ఆయ న.. యడవల్లి, లక్ష్మీపురం, మేడేపల్లి, ధనియాలగూడెం, సీతరాంపురం, కట్టకూరు, మాదాపురం, వెంకటాపురం, గోకినేపల్లి గ్రామాల్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కొండబాల కోటేశ్వరరావుతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్‌రాజు మాట్లాడుతూ.. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి సీతారాంపురం గ్రామానికి కనీసం రోడ్డు కూడా తీసుకురాలేకపోయారని, అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాను చేసినట్లుగా చెప్పుకుంటున్నాని, ఎక్కడైనా అభివృద్ధి లేకపోతే దాని గురించి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మచ్చుకైనా తేలేదని విమర్శించారు. అసలు దళితబంధు పథకంపై మాడ్లాడే హక్కు ఆయనకు లేనే లేదని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిందే దళితబంధు అని స్పష్టం చేశారు. భట్టిది వారసత్వ రాజకీయమైతే తనది ఉద్యమాల రాజకీయమని, విద్యార్థి దశ నుంచే తాను రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. సీఎం కేసీఆర్ గు రించి మాట్లాడే అర్హత కూడా ఎమ్మెల్యే భట్టికి లేదని విమర్శించారు. సీతారాంపురం, కట్టకూరు గ్రామాల్లో వర్షంలో నూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని స్పష్టంచేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సామినేని హరిప్రసాద్, వాచేపల్లి లక్ష్మారెడ్డి, పసుపులేటి దుర్గ, పోట్ల ప్రసాద్, సామినేని వెంకటేశ్వరరావు, మందరపు ఎర్ర వెంక న్న, బత్తుల వీరారెడ్డి, పసుపులేటి వెంకట్, తోట ధర్మారా వు, బండ్ల వాసు, మీగడ శ్రీనివాస్‌యాదవ్, చెరుకుపల్లి విజయ, బంక మల్లయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, పచ్చ సీతరామయ్య, చెరుకుపల్లి భిక్షం, షేక్ పాషా, నాయిని వీరనారాయణ, బత్తుల వెంకట్రావ్, నీరుకొండ సతీశ్, శివంగుల నాగేశ్వరరావు, శంకర్, సామినేని రాము, కోటి అనంతరాములు, నాగబాబు, నాగార్జున, అమరయ్య, శిల్వరాజు, అ మడాల జక్కడర్, కోడె బాబు, స్వాతి, రమేశ్, ధారా రా ము, పంది శ్రీను, నీరజ, పద్మనాభం పాల్గొన్నారు.