కారేపల్లి (కామేపల్లి), నవంబర్ 24: కాంగ్రెస్ మాయగాళ్లవన్నీ ఒట్టి మాటల గారడీలేనని బీఆర్ఎస్ ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థి హరిప్రియానాయక్ విమర్శించారు. వారు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలెవరూ నమ్మడం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో గ్రామాల్లో అద్దంలా మెరుస్తున్న సీసీ రోడ్లు కూడా చెబుతున్నాయని అన్నారు. అందుకని అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపే ప్రజలందరూ ఉన్నారని స్పష్టం చేశారు. కామేపల్లి మండలంలో శుక్రవారం పర్యటించిన ఆమె.. కెప్టెన్ బంజర, ముచ్చర్ల, రాయిగూడెం, రుక్కితండా, బండిపాడు, కొమినేపల్లి గ్రామ పంచాయతీల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం ఎన్నికలప్పుడే గ్రామాల్లో కన్పించే నాయకులందరూ నేడు ప్రజలకు అనేక మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు.
గ్యారెంటీలన్నీ సాధ్యం కానివేనని, ప్రజలను మభ్యపెట్టేందుకే వారు వీటి గురించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. గడిచిన ఐదేళ్లలో సీఎం కేసీఆర్ సహకారంతో ఇల్లెందు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని అన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వివిధ గ్రామాల్లో పలు పార్టీలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు దనియాకుల హన్మంతరావు, బానోత్ సునీత, గుంపెనపల్లి అనంతరాములు, జాటోత్ లూసీ, మూడు దుర్గాజ్యోతి, బోడెపూడి అనురాధ, మల్లంపాటి నర్సింహారావు, ఆంతోటి అచ్చయ్య, వడియాల కృష్ణారెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, గుగులోత్ సునీత, మూడు రాధ, కృష్ణప్రసాద్‌నాయక్, కొమ్మినేని శ్రీనివాసరావు, చల్లా హరి, అజ్మీరా రాజునాయక్, ఐతనబోయిన విఠల్, దండగల దేవేందర్, బట్టు శంకర్, కొనకంచి శంకర్, భగవాన్, దూగుంట్ల వీరన్న, బానోత్ రాములు, ప్రసాద్, దొడ్ల రవి పాల్గొన్నారు.