బోనకల్లు, ఆగస్టు 02 : బీఆర్ఎస్ బోనకల్లు మండల మాజీ అధ్యక్షుడు, చిరునోముల గ్రామానికి చెందిన రేగళ్ల వీరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలిసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం ఆయనను పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే గ్రామంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ గరపాకుల రాఘవులు కుమారుడు నాగేంద్రబాబు, పరిశ శ్రీను కుమారుడు సాయికృష్ణ ను ఆయన పరామర్శించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వర్రావు, రైతు నాయకులు వేమూరి ప్రసాద్, కాకాని శ్రీనివాసరావు, కొనకంచి నాగరాజు, బంధం నాగేశ్వర్రావు, తన్నీరు పుల్లారావు, గరపాకుల రామకృష్ణ, బోడెపుడి నరసింహారావు, పిల్లం వెంకటేశ్వర్లు, మామిడాల సతీశ్, తిరుపతిరావు, నిమ్మతోట రవి, వేమా వెంకటేశ్వర్లు, పిడతల నాగరాజు, పిల్లెం గోపి పాల్గొన్నారు.