కారేపల్లి జూలై 17: ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని లింగంబంజర గ్రామానికి చెందిన మహిళలు గురువారం బోనాల పండుగ వేడుకను ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు ఇంటివద్ద నైవేద్యాన్ని తయారు చేసుకుని కారేపల్లి క్రాస్ రోడ్ లో గల ఎర్రమ్మ తల్లి దేవాలయం వద్దకు బోనాలు ఎత్తుకొని కాలినడకన చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారికి మొక్కలు చెల్లించారు. ఈ కార్యక్రమంలో రామలింగాపురం(కారేపల్లి క్రాస్ రోడ్) గ్రామ పెద్దలతో పాటు ఆలయ కమిటీ సభ్యులు,లింగం బంజార మహిళలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Leopard | అలిపిరికి దగ్గరలో చిరుత సంచారం.. భయాందోళనలో శ్రీవారి భక్తులు
వ్యాసరూప ప్రశ్నలెన్ని? ఆబ్జెక్టివ్ ఎంత?.. పదో తరగతిలో పరీక్షల్లో మార్కులపై సందిగ్ధత
Genelia | మూడు సంవత్సరాలుగా నా భర్త ఆ విషయంలో టార్చర్ చేస్తున్నాడు: జెనీలియా