MLC Polling | బోనకల్, ఫిబ్రవరి 18 : ఈ నెల 27వ తేదీన జరగనున్న ఖమ్మం- నల్గొండ -వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కార్మిక శాఖ అధికారి, మండల స్పెషల్ ఆఫీసర్ కటారు విజయభాస్కర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు.
బోనకల్లు ఉన్నత పాఠశాలలో 100వ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన.. ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వివరాలను స్థానిక తహసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఓటు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ స్టేషన్‌కు కావాల్సిన సదుపాయాల గురించి వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థుల కోసం తయారుచేసిన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.
విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన వర్కర్లకు నాణ్యమైన భోజనాన్ని, పరిశుభ్రంగా అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అనిశెట్టి పున్నం చందర్, ఆర్ఐ గుగులోతు లక్ష్మణ్ ఉన్నారు.
State Level Select | రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కోటపల్లి ఆశ్రమ విద్యార్థిని ఎంపిక
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు