కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్
కోర్టుల్లో ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి, సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు.
- జాతీయ లోక్ అదాలత్‌లో భద్రాద్రి జిల్లా జడ్జి పాటిల్ వసంత్
కొత్తగూడెం టౌన్, మార్చి 28 : కోర్టుల్లో ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి, సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరుపక్షాలు స్నేహ పూర్వక వాతావరణంలో తమ కేసులను పరిష్కరించుకునేందుకు ఇదొక సువర్ణావకాశమని తెలిపారు.
సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, బ్యాంక్ రికవరీ, మోటర్ వాహన ప్రమాద బీమా కేసులను ఇరువర్గాలు పరస్పర అంగీకారంతో రాజీ పడవచ్చని సూచించారు. కాగా.. ఎస్బీఐ సౌజన్యంతో కక్షిదారులకు పులిహోర, మంచినీళ్ల సదుపాయం కల్పించారు. న్యాయమూర్తులు సరిత, రాజేందర్, కిరణ్‌కుమార్, సుచరిత, బత్తుల రవికుమార్, వినయ్‌కుమార్, సాయిశ్రీ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

